Sunday 13 September 2015

మన గ్రామ ప్రజలకు ఒక మనవి:



పల్లెటూరు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చెట్టులు, పక్షుల కిలకి రావాలు వాటిపైనుంచు వచ్చే చల్లని పిల్లగాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.

మన వూరు పల్లెటూరే,

  • కానీ మనవూరి విషయంలో ఇవేవీ లేవు ఎందుకు? 
  • వేసవి అంటే మన వూరి వారికి వణుకు, ఎందుకు?
  • వేసవి వస్తే, మన పిల్లలని ఎండలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు వూరికి రావద్దు అనే దుస్తీతి ఎందుకు వచ్చింది?
  • వేసవిలో ముసలి మరియు పసి పిల్లల పరిస్తీటి ఏంటి?
ఇలాగే ఉంటే కొన్ని సంవచ్చరాలకు, వేసవిలో వూరు వదిలి వెల్లవలసె పరిస్తీతి వస్తుంది.


ఎందుకు అంటే మన వూరిలో చెట్లు లేవు:

  • అవే ఉంటే, వేసవిలో చల్లని నిడని ఇచ్చేవి.
  • అవే ఉంటే, వేసవిలో నీటి అద్దడి ఉండేది కాదు.
  • అవే ఉంటే, వేసవిలో వాడదెబ్బ చావులు ఉండవు.
  • అవే ఉంటే, అనేక చెర్మ మరియు శ్వాస వ్యాదులు రావు.

మూఢ నమ్మకాలు:

చెట్లు ఇంటి ముందు ఉంటే, వాటి వేళ్ళు గోడలను పడగోడతాయి.
  • ఎక్కడన్నా చెట్టు వల్ల ఇల్లు కూలాయా?
  • ఎండల కారణంగా, ఇల్లు బీటలు వారి కూలిన సంధర్భాలు ఎన్నో ఉన్నాయి.
  • చెట్టు నిడన ఉన్న ఇల్లు ఎక్కువకాలం మన్నుతాయి

చెట్టు ఆకులు రాలి ఇల్లు పాడుఅవుతుంది లేదా చిమ్మడం కస్టమ్.

  • చెట్టు ఆకులలో ఓషుద గుణాలు ఉంటాయి.
  • ఇంటి ముందు చెట్టు ఉంటే, జలుబు, తలనొప్పి మరియు జ్వరం వంటి జబ్బులు వచ్చే అవకాశం తక్కువ.
సారాంశం:
వేసవిలో మనం ఎన్నో అవస్తలు పడుతున్నాం, అవి మన పిల్లలు పడకూడదు. దయచేసి అందరు, చెట్లు నాటటానికి సహకరించండి. కొన్ని సంవచ్చరాలకి చల్లని నీడని ఇస్తాయి, వేసవిలో ఎండ తీవ్రత తగ్గుతుంది. భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది, దానివల్ల నీటి అద్దడి తగ్గుతుంది.